మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: స్టార్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar) దర్శకురాలిగా పరిచయమైన ‘సరస్వతి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. తన కథను ఇష్టమొచ్చినట్లు మార్చేసి, దారుణంగా నాశనం చేశారని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బన్నీ వాసు, ఈటీవీ విన్ సపోర్ట్ తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి వాస్తవానికి ఆయనే దర్శకత్వం వహించాల్సి ఉంది. “సినిమా నా కథతో మొదలై వేరే కథతో ముగుస్తుంది. నాది రివెంజ్ డ్రామా కాదు. నాకెలాంటి సమాచారం ఇవ్వకుండా కథను మానభంగం చేశారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టైటిల్ కార్డ్ లో రైటర్ గా పేరు వేసినా, కనీసం ప్రమోషన్స్ లోనూ తనను పిలవలేదని వాపోయారు.
టాలీవుడ్ లో ఒక స్టార్ రైటర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యవహారం రచయితల హక్కులపైనా కొత్త చర్చకు తెరలేపింది.
దీనిపై దర్శకురాలు వరలక్ష్మి, చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- సింహ రాశి వారికి రాజయోగం.. ఆ మూడు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!
- బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి ఫిక్స్.. లాయర్ ఇంటి అల్లుడు కానున్న యంగ్ హీరో!
- ఢిల్లీలో ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్!
- ఎక్కడో క్షిపణుల మోత.. ఇక్కడ వంటింట్లో మంట.. సామాన్యుడిపై వార్ ఎఫెక్ట్!
- డీజే టిల్లు’ ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇంట విషాదం.
