Advertisement

సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం వార్తలు

మెగా కుటుంబానికి చెందిన నటుడు సాయి దుర్గా తేజ్ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నవంబర్ 5న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం జరగనుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

డిసెంబరులో వివాహం జరగనుందా?

హైదరాబాద్‌లోనే డిసెంబరు నెలలో సాయి దుర్గా తేజ్ వివాహం జరిపేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. అయితే, ఈ నిశ్చితార్థం లేదా వివాహ తేదీలపై నటుడు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆయన చేసుకోబోయే అమ్మాయి వివరాలు కూడా రహస్యంగానే ఉన్నాయి. ఆమె ఆయనకు పాత స్నేహితురాలని కొన్ని ప్రచారాలు చెబుతున్నప్పటికీ, స్పష్టమైన వివరాలు వెల్లడి కాలేదు.

Advertisement

సినిమాల విషయానికి వస్తే, రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాంబరాల ఏటి గట్టు’ చిత్రంలో సాయి దుర్గా తేజ్ నటిస్తున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం అభిమానులు ఆయన పెళ్లికి సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement