Advertisement

తన పెళ్లికి అపరిచితులను ఆహ్వానించిన చైనా యువకుడు

చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌కు చెందిన 24 ఏళ్ల జూ చెంగ్‌హాంగ్ అనే యువకుడు తన వివాహానికి అపరిచితులను ఆహ్వానించగా, వేలాది మంది వచ్చి నవదంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యుల మద్దతు తక్కువగా ఉండటంతో తన పెళ్లికి తక్కువ మంది వస్తారేమోనని భావించిన అతను, సోషల్ మీడియా వేదికగా ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన పిలుపు

అక్టోబర్ 25న జూ చెంగ్‌హాంగ్ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ డౌయిన్‌లో బహిరంగ ఆహ్వానాన్ని పోస్ట్ చేశారు. అక్టోబర్ 31న జరిగిన తన వివాహ వేడుకకు రావాలని కోరగా, నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది.

Advertisement

పెళ్లి రోజున వేలాది మంది అపరిచితులు హాజరై నూతన దంపతులకు కానుకలు, గృహోపకరణాలు మరియు ఆహార పదార్థాలను అందించారు. జనసందోహం ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు వేడుకను పెద్ద ప్రాంగణానికి మార్చగా, స్థానిక అధికారులు ట్రాఫిక్ మరియు గుంపును నియంత్రించడంలో సహాయపడ్డారు.

Advertisement