మన పత్రిక, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఒక ఆర్టీసీ డ్రైవర్ తన ప్రాణాపాయ స్థితిలోనూ బాధ్యతను మరువకుండా వ్యవహరించి 45 మంది ప్రయాణికులను కాపాడారు. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ త్రిమోది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ పరిస్థితిలోనూ ఏమాత్రం తడబడకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు సురక్షితంగా ఆపివేశారు.
ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ త్రిమోదికి అస్వస్థత కలగడంతో, ప్రయాణికులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
