RRB Section Controller Jobs 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సికింద్రాబాద్ జోన్‌లో 25 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 24, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హతగా ఉండాలి. వయస్సు 20 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500. SC, ST, PwD, ExSM, మహిళలు, టీజీ అభ్యర్థులకు రూ.250 మాత్రమే.
Advertisement
ఎంపిక విధానంలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 వేతనం చెల్లిస్తారు.
రైల్వేలో ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి :
Advertisement
