అప్రెంటిస్ శిక్షణ కోసం తూర్పు మధ్య రైల్వే ( RRB East Central Railway Apprentices Notification 2025 ) ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 1,149 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు 25 అక్టోబర్ 2025 నాటికి కనీసం 15 ఏళ్లు, గరిష్ఠం 24 ఏళ్లు ఉండాలి.
SC/ST వర్గాలకు 5 సంవత్సరాలు, OBC కు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10–15 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.
అర్హత:
- 10వ తరగతి లేదా సమానం (గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులు)
- ITI లో సంబంధిత ట్రేడ్ లో NTC లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఉండాలి.
నెలవారీ గౌరవ వేతనం: రూ. 15,000 – 20,000
శిక్షణ పూర్తయిన తర్వాత జారీ చేసే సర్టిఫికెట్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది.
దరఖాస్తు రుసుము: రూ.100 (తిరిగి చెల్లించబడవు)
ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
ఎలా దరఖాస్తు చేయాలి?
www.ecr.indianrailways.gov.in వెబ్‌సైట్ లో ఉన్న హాజీపూర్ H.Q. > RRC/Patna లింక్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 26 సెప్టెంబర్ 2025
- చివరి తేదీ: 25 అక్టోబర్ 2025, 11:59 PM
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

