Advertisement

అవెంజర్స్ డూమ్స్‌డేలో డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్

మన పత్రిక: మార్వెల్ స్టూడియోస్ తమ రాబోయే చిత్రం ‘అవెంజర్స్ డూమ్స్‌డే’కు సంబంధించి పూర్తి స్థాయి ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్ తిరిగి నటిస్తుండటం ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది. అయితే, ఆయన ఈసారి ఐరన్ మ్యాన్ పాత్రలో కాకుండా, మార్వెల్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన విలన్ ‘డాక్టర్ డూమ్’గా కనిపించనున్నారు. ఈ పాత్ర మల్టీవర్స్ యుద్ధంలో ప్రధాన ముప్పుగా మారనుంది.

చిత్రంలో ప్రముఖ నటీనటులు

ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్‌తో పాటు క్రిస్ ఎవాన్స్ కూడా స్టీవ్ రోజర్స్ లేదా కెప్టెన్ అమెరికా పాత్రలో తిరిగి కనిపించడం విశేషం. వీరితో పాటు క్రిస్ హెమ్స్‌వర్త్ (థోర్), ఆంథోనీ మాకీ (కెప్టెన్ అమెరికా), పాల్ రడ్ (యాంట్-మ్యాన్), పెడ్రో పాస్కల్ (రీడ్ రిచర్డ్స్), వనెసా కిర్బీ (సూ స్టోమ్), జోసెఫ్ క్విన్ (హ్యూమన్ టార్చ్), ఎబోన్ మోస్-బాచ్రాక్ (ద థింగ్) వంటి భారీ తారాగణం నటిస్తోంది. అలాగే పలువురు ఎక్స్-మెన్ పాత్రలు కూడా ఇందులో సందడి చేయనున్నాయి. రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement
Advertisement