Advertisement

సండియార్ చిత్రాన్ని ప్రకటించిన కమల్ హాసన్

నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం సండియార్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. గతంలో కేహెచ్ 237 గా వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్ పోస్టర్లు విడుదలయ్యాక ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మదురై నేపథ్యం మరియు ఇతర వివరాలు

మదురై గ్రామీణ నేపధ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. గతంలో విరుమాండి సినిమా కోసం అనుకున్న సండియార్ అనే శీర్షికనే ఇప్పుడు ఈ చిత్రానికి ఖరారు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు రజనీకాంత్ కథానాయకుడిగా అశ్విత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధర్మన్ చిత్రానికి కూడా కమల్ హాసన్ నిర్మాగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
Advertisement