Advertisement

రామ్ పోతినేని RAPO23 చిత్రంతో తెలగులోకి రీతేష్ దేశ్‌ముఖ్

బాలీవుడ్ నటుడు రీతేష్ దేశ్‌ముఖ్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సైకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం RAPO23 ద్వారా ఆయన తెలుగు సినిమాలో నటించనున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్

ఈ చిత్రంలో రీతేష్ దేశ్‌ముఖ్ ఒక కీలకమైన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు కెమెరామెన్‌గా తిరునావుక్కరసు, సంగీత దర్శకుడిగా సామ్ సిఎస్, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరిస్తున్నారు.

Advertisement
Advertisement