Advertisement

రేపల్లె జగనన్న కాలనీలో పోలీసుల సోదాలు: 67 బైకులు, రెండు ఆటోలు సీజ్

మన పత్రిక, రేపల్లె: జగనన్న కాలనీ (Jagananna Colony) పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. స్థానిక పోలీసులు, ఈగల టీం సభ్యులు కలిసి కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ తనిఖీల్లో మొత్తం 67 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఇటువంటి సోదాలు చేపట్టినట్లు డిఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలని అధికారులు సూచించారు. కాలనీలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భవిష్యత్తులో కూడా నిరంతర నిఘా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement