Advertisement

ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని పవన్ కల్యాణ్ ఆదేశం

మన పత్రిక: రాష్ట్రంలోని Red Sanders స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మన ఎర్రచందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలకుండా పట్టుకోవాలని అధికారులకు సూచించారు. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న చిన్న స్థాయి వ్యక్తులతో పాటు, దీని వెనుక ఉన్న ముఖ్యమైన కింగ్ పిన్‌లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి మరియు అడవుల్లో నిఘా పెంచడానికి డ్రోన్లు, ఇతర ఆధునిక టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. గత రెండేళ్ల కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులకు సంబంధించి 1,239 మందిని అరెస్ట్ చేశామని, 12 మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించామని అధికారులు వెల్లడించారు. అలాగే స్మగ్లింగ్ కేసుల్లో శిక్షలు పడే రేటు ప్రస్తుతం 95 శాతానికి పెరిగిందని అధికారులు సమావేశంలో ఆయనకు తెలిపారు.

Advertisement
Advertisement