Advertisement

రూ. 20 కోసం వృద్ధుడి దారుణ హత్య, రెబ్బెనలో కలకలం

మన పత్రిక, రెబ్బెన: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మసాడి సోమయ్య (65) అనే వృద్ధుడు తన కూతురిని రైలు ఎక్కించేందుకు స్టేషన్‌కు వచ్చాడు. కూతురు రైలు ఎక్కిన తర్వాత టీ తాగేందుకు స్టేషన్ బయటకు వచ్చిన సోమయ్యను బోగారపు నగేష్ అనే వ్యక్తి సమీపించి రూ. 20 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని సోమయ్య చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

గొడ్డలితో దాడి

డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నగేష్ కక్ష కట్టి, అక్కడి నుంచి వెళ్తున్న సోమయ్యను గొడ్డలితో వెంబడించాడు. నిందితుడు సోమయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి తల, మొండెం వేరైపోయేలా నరికేశాడు. ఈ అమానుష ఘటనను గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, నగేష్ అడవుల్లోకి పారిపోయాడు.

Advertisement

పోలీసుల గాలింపు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న బోగారపు నగేష్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement