RBI Grade B Recruitment 2025 Notification Telugu : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్ ‘బి’ (డైరెక్ట్ రిక్రూట్-డిఆర్) అధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్, డిఇపిఆర్ (ఆర్థిక మరియు విధాన పరిశోధన), డిఎస్ఐఎం (గణాంకాలు మరియు సమాచార నిర్వహణ) కేడర్లలో మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులు సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 30, 2025 (సాయంత్రం 6:00 గంటల వరకు) www.rbi.org.in ద్వారా ఆన్‌లైన్లో సమర్పించాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా PG in ఎకనామిక్స్ / MBA / PGDM చేసి ఉండాలి. 01-07-2025 నాటికి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జనరల్, OBC, EWS అభ్యర్థులు ₹850 ఫీజు చెల్లించాలి, SC/ST/PWBD అభ్యర్థులకు ₹100 మాత్రమే. ఎంపిక ప్రైమరీ, మెయిన్స్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. నెలకు ₹65,000 నుంచి ₹1,20,000 వరకు జీతం లభిస్తుంది. పూర్తి వివరాలు బ్యాంక్ వెబ్‌సైట్ మరియు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ లో సెప్టెంబర్ 13, 2025 న ప్రచురితం కానున్నాయి.

► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

