Advertisement
RRB NTPC Graduate Notification 5810 posts

RRB NTPC Graduate Notification: డిగ్రీ అర్హతతో 5,810 ఉద్యోగాలు

రైల్వేలో డిగ్రీ అర్హతతో ఉద్యోగం కావాలనుకునే వారికి బంగారు అవకాశం. ఆర్ఆర్బీ నేటి నుంచి (అక్టోబర్ 21) 5,810 గ్రాడ్యుయేట్ ఎన్‌టీపీసీ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

పోస్టులు: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ (161), స్టేషన్ మాస్టర్ (615), గూడ్స్ ట్రైన్ మేనేజర్ (3416), జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (921), సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (638), ట్రాఫిక్ అసిస్టెంట్ (59). మొత్తం 5,810 ఖాళీలు.

Advertisement

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లిష్ లేదా హిందీలో కంప్యూటర్ టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.

ఎంపిక విధానంలో మొదటి దశ CBT, రెండో దశ CBT, కంప్యూటర్ ఆధారిత టైపింగ్/ఆప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి. సీబీటీలో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

Advertisement

వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, పీడబ్ల్యూడీ, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 250, ఇతరులకు రూ. 500.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 21, 2025
చివరి తేదీ: నవంబర్ 20, 2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 22, 2025
దరఖాస్తు సవరణ: నవంబర్ 23 నుంచి డిసెంబర్ 2, 2025
దరఖాస్తు చేయడం ఎలా? RRB అధికారిక వెబ్‌సైట్‌లో ‘RRB NTPC Graduate Recruitment 2026’ లింక్ క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకొని, ఫామ్ నింపి, ఫీజు చెల్లించి, సబ్మిట్ చేసి కాపీ డౌన్‌లోడ్ చేసుకోండి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement