Advertisement

రాయలసీమ ఎమ్మెల్సీ పదవి బలిజలకే ఇవ్వాలి: శ్యామల డిమాండ్

మన పత్రిక, మదనపల్లె: రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ (MLC) స్థానాన్ని బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని రాయలసీమ పీపుల్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షురాలు శ్యామల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ సామాజిక వర్గం జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని శ్యామల విమర్శించారు. రాజకీయంగా తమకు తగిన ప్రాధాన్యం కల్పించి సామాజిక న్యాయం చేయాలని ఆమె కోరారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించాలని, లేని పక్షంలో రాయలసీమ వ్యాప్తంగా ఉన్న బలిజ సంఘాలు ఏకమై ఉద్యమిస్తాయని ఆమె హెచ్చరించారు.

Advertisement
Advertisement