Advertisement

రాయచోటిలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మన పత్రిక, రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 73 మంది అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కుల విలువ సుమారు రూ.63 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,210 మందికి రూ.14.40 కోట్ల మేర సాయం అందించామన్నారు.

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోగులకు ఈ నిధులు పెద్ద భరోసాగా నిలుస్తాయని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సంజీవినీ (Sanjeevini) అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రోగుల డేటా సేకరించడం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement