Advertisement

ఇరుముడి వసూళ్ల హోరు: మూడో రోజు భారీగా అమ్ముడైన టికెట్లు

మన పత్రిక: మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజవంతంగా ప్రదర్శితమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న మద్దతుతో వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో హౌస్‌ఫుల్ కాంబినేషన్లతో షోలు నడుస్తున్నాయి.

మూడో రోజైన ఆదివారం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో (BookMyShow) సమాచారం ప్రకారం, ఆదివారం ఒక్క రోజే 4.05 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. మొదటి రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, బుక్‌మైషో మరియు డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇప్పటివరకు మొత్తం 25 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలను నమోదు చేసింది. సోమవారం కూడా టికెట్ బుకింగ్స్ బలంగా ఉండటంతో ఈ చిత్రం ముందుముందు మరిన్ని మైలురాళ్లను సాధించే అవకాశం ఉంది.

Advertisement

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Advertisement