Advertisement

ఇరుముడి మొదటి రోజు వసూళ్లు ఎంతంటే?

మన పత్రిక: రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణతో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనను సాధించుకుంది.

వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజు భారతదేశంలో రూ.14.80 కోట్ల నికర (నెట్) వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా 2,673 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం, దాదాపు 76.9 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. భారత్‌లో మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.17.20 కోట్లుగా ఉండగా, విదేశీ మార్కెట్ నుంచి మరో రూ.7 కోట్లు లభించాయి. దీంతో తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.

Advertisement

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రను పోషించారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రవితేజ నటనకు, భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ శుభారంభంతో వారాంతంలో వసూళ్లు మరిన్ని పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement