Advertisement

బాలికకు బలవంతపు పెళ్లి.. తండ్రి, భర్తకు జీవిత ఖైదు.. పోక్సో కోర్టు తీర్పు.

మన పత్రిక, వెబ్​డెస్క్: మైనర్ బాలికకు ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిపించిన కేసులో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు (POCSO Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలిక తండ్రికి, భర్తకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేసు వివరాలు: 2018లో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ పరిధిలో 17 ఏళ్ల మైనర్ బాలికకు ఆమె తండ్రి బలవంతంగా వివాహం జరిపించాడు. అనంతరం బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. నేరం రుజువు కావడంతో భర్త, తండ్రి ఇద్దరికీ జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు ఒక్కొక్కరికి రూ. 75 వేల చొప్పున జరిమానా వేసింది.

Advertisement

బాధితురాలికి భవిష్యత్తు అవసరాల నిమిత్తం రూ. 15 లక్షల పరిహారం (Compensation) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బాలికల రక్షణ, బాల్య వివాహాల నిరోధంలో ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు.

Advertisement