రామ్చరణ్ కు సీఎం సిద్ధరామయ్య సత్కారం: మైసూరులో ప్రత్యేక సమావేశం
ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్చరణ్ ( Ram Charan ) ఆదివారం మైసూరులో ( Mysore ) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ( CM Siddaramaiah ) కలిశారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ( Peddi Movie ) చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరులో ఉండటంతో, ఆయన ఆహ్వానం మేరకు రామ్చరణ్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామ్చరణ్ సీఎంకు శాలువా సమర్పించారు.
అనంతరం సీఎం సిద్ధరామయ్య రామ్చరణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పారు. ఇద్దరూ కాసేపు సినిమాల గురించి స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ‘పెద్ది’ సినిమా పాట చిత్రీకరణ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది. ఈ సన్నివేశంలో వెయ్యి మంది డాన్సర్లు పాల్గొంటున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జాన్వీ కపూర్ కథానాయిక. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పెద్ది’ సినిమా 2025 మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

