Advertisement
High court

High court: అత్తమామలను చూడాల్సిందే హైకోర్టు కీలక తీర్పు!

మన పత్రిక, వెబ్​డెస్క్: కారుణ్య నియామకం ద్వారా భర్త ఉద్యోగాన్ని పొందిన భార్య, ఖచ్చితంగా తన అత్తమామలను చూసుకోవాల్సిందేనని రాజస్థాన్‌ హైకోర్టు జోధ్‌పూర్‌ బెంచ్‌ చారిత్రక తీర్పును వెలువరించింది.

Advertisement

అత్తమామలతో ఉంటానని అఫిడవిట్ ఇచ్చి ఉద్యోగం పొందిన ఓ మహిళ, ఆ తర్వాత సొంత తల్లితండ్రులతో ఉండటంతో ఆమె మామ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు, ఆమె వేతనం నుంచి ప్రతినెలా రూ. 20 వేలు మామ ఖాతాలో జమ చేయాలని సంబంధిత శాఖను ఆదేశించింది.

Advertisement

కారుణ్య నియామకం హక్కు కాదని, “కుటుంబం” అంటే మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement