Advertisement

The Rajasaab Review: ది రాజా సాబ్ రివ్యూ.. ప్రభాస్ వన్ మ్యాన్ షో

Rajasaab review telugu: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం నేడు (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వింటేజ్ ప్రభాస్‌ను చూపిస్తానని మాటిచ్చిన మారుతి, ఆ మాటను నిలబెట్టుకున్నారా? సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో నిలుస్తుంది? మన పత్రిక రివ్యూలో చూద్దాం.

Advertisement

కథేంటంటే? రాజు (ప్రభాస్) తన నానమ్మ జానకి దేవి (జరీనా వహబ్)ని ప్రాణంగా చూసుకుంటాడు. ఆమె తన భర్త కనకరాజు (సంజయ్ దత్) కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటుంది. అసలు కనకరాజు ఎవరు? ఆయనకు, రాజుకు ఉన్న సంబంధం ఏంటి? కనకరాజు ఆస్తిపై ఎందుకు మమకారం పెంచుకున్నాడు? రాజా సాబ్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

  • ప్లస్ పాయింట్స్: ఇది పక్కా ప్రభాస్ వన్ మ్యాన్ షో. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌ను ప్రభాస్ అద్భుతంగా పండించారు. ముఖ్యంగా నానమ్మతో వచ్చే సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లో ప్రభాస్ నటన పీక్స్‌లో ఉంటుంది. సంజయ్ దత్, జరీనా వహబ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్లు (నిధి, మాళవిక, రిద్ది) ఉన్నంతలో పర్వాలేదనిపించారు. క్లైమాక్స్ విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి.
  • మైనస్ పాయింట్స్: మారుతి రైటింగ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. ఫస్టాఫ్ కథనం చాలా వీక్‌గా, సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయినా, కొన్ని సీన్లు ఫోర్స్‌డ్ గా ఇరికించిన భావన కలుగుతుంది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్ లోపించాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్లైమాక్స్ లో తప్ప మిగతా చోట్ల తేలిపోయాయి.

టెక్నికల్ అంశాలు: కార్తీక్ పలాని సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. సెకండాఫ్‌లో వచ్చే హారర్ విజువల్స్ బాగున్నాయి. అయితే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో క్లారిటీ మిస్ అయ్యింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఫైనల్ వర్డిక్ట్: ‘ది రాజా సాబ్’ ప్రభాస్ అభిమానులకు వింటేజ్ ట్రీట్ ఇస్తుంది. కామెడీ, ఎమోషన్స్ బాగున్నాయి. కానీ బలహీనమైన ఫస్టాఫ్, సాగదీత కథనం సినిమాకు మైనస్. తక్కువ అంచనాలతో వెళ్తే ఈ పండుగ సీజన్‌లో ఓ సారి చూడొచ్చు.

మన పత్రిక రేటింగ్: 2.75/5

Advertisement