మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) విడుదలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి స్పెషల్ ప్రీమియర్స్ పడుతున్నాయి. కానీ, ప్రభాస్ అడ్డాగా భావించే నైజాం (Nizam) ఏరియాలో మాత్రం సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా, ఇప్పటి వరకు ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ఫ్యాన్స్‌ను, ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది.
టికెట్ రేట్ల పెంపు చిక్కులు సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు టికెట్ రేట్ల పెంపు (Ticket Hikes) సర్వసాధారణం. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ పర్మిషన్ల విషయంలో ఇబ్బందులు ఉండేవి. కానీ అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆ సమస్య నైజాంకు షిఫ్ట్ అయ్యింది. ఇటీవలి కాలంలో కొన్ని పెద్ద సినిమాల విషయంలో జరిగిన పరిణామాల వల్ల తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుపై అంత సుముఖంగా లేదు. దీంతో ‘రాజా సాబ్’ మేకర్స్ సకాలంలో అనుమతులు తెచ్చుకోవడంలో విఫలమయ్యారని, పూర్ ప్లానింగ్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు అంటున్నారు.
కలెక్షన్లపై గట్టి దెబ్బ? ‘అఖండ-2’ విషయంలో చివరి నిమిషంలో పర్మిషన్ ఇచ్చి వెనక్కి తీసుకున్నా.. అప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో నడిచిపోయింది. కానీ ‘రాజా సాబ్’ విషయంలో ప్రీమియర్స్, డే-1 షోల బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు.
- సినిమా టాక్ యునానిమస్‌గా ఉంటే పర్లేదు కానీ.. ఏమాత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా లేట్ బుకింగ్స్ ప్రభావం కలెక్షన్లపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.
- ఆడియన్స్ వెయిట్ చేసి విసిగిపోయే ప్రమాదం ఉంది.
భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాతలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ట్రేడ్ పండితులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
