rrb group d exam date 2025 : భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 32,438 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్షలు నవంబర్ 17, 2025 నుంచి డిసెంబర్ 2025 చివరి వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష నగరం, తేదీ వివరాలు మరియు SC/ST అభ్యర్థుల ప్రయాణ అనుమతి (ట్రావెల్ అథారిటీ) డౌన్లోడ్ కోసం లింక్, పరీక్షకు 10 రోజుల ముందు అన్ని RRB అధికారిక వెబ్సైట్లలో అందుబాటులోకి రానుంది. పరీక్షా కేంద్రంలో ప్రవేశించే ముందు అభ్యర్థులు ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ పూర్తి చేయాలి. దీని కోసం అసలు ఆధార్ కార్డు లేదా ఇ-ఆధార్ ప్రింట్ తీసుకురావాలి. ఇంకా ఆధార్ వెరిఫికేషన్ చేయని వారు www.rrbapply.gov.in లో లాగిన్ అయి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఉద్యోగ హామీలతో అభ్యర్థులను మోసం చేసే దగాకోరుల నుంచి జాగ్రత్త వహించండి. ఎంపికలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా మాత్రమే జరుగుతాయి.

