మన పత్రిక, వెబ్‌డెస్క్: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1104 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హతల విషయానికొస్తే, అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. అక్టోబర్ 16, 2025 నాటికి అభ్యర్థుల కనీస వయసు 15 సంవత్సరాలు, గరిష్ట వయసు 24 సంవత్సరాలుగా నిర్ణయించారు.
నిబంధనల ప్రకారం, ఓబీసీ అభ్యర్థులకు 27 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 29 ఏళ్లు, దివ్యాంగులకు 34 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 100 రూపాయల సాధారణ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదని స్పష్టం చేశారు.
ఈ పోస్టులకు ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులో సమర్పించిన వివరాల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు గోరఖ్‌పూర్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు ప్రింట్ చేసిన దరఖాస్తు ఫారంతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాల్సి ఉంటుంది.
► Read latest Telugu News
► Follow us on Google News

