Pista House : హైదరాబాద్ నగరంలోని ఫేమస్ హోటల్స్ అయిన పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ లాంటి హోటళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఈ హోటళ్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు ఇళ్లలో ఒకేసారి సోదాలు చేస్తున్నారు.
రాజేంద్రనగర్ లో ఉన్న గోల్డెన్ హైట్స్ కాలనీలో ఉంటున్న పిస్తా హౌస్ ఓనర్స్ అయిన మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. షాగౌస్, మెహిఫిల్ చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
ఐటీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. లక్డీకపూల్, షేక్‌పేట్, అత్తాపూర్, టోలీచౌకి, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో రెండు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో 20 కోట్ల రూపాయల నగదును, భారీగా బంగారాన్ని సీజ్ చేసినట్టు సమాచారం. అలాగే ఆయా హోటళ్లలో పని చేస్తున్న వర్కర్లను బినామీలుగా పెట్టుకొని వాళ్ల మీద ఆస్తులు ఉన్న పలు డాక్యుమెంట్లను, బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. హవాలాగా బ్లాక్ మనీని ఈ హోటళ్ల ఓనర్స్ దారి మళ్లించినట్టుగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అందుకే ఇవాళ కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
