మన పత్రిక: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తును పరమావధిగా చేసుకుని పనిచేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు PVN Madhav స్పష్టం చేశారు. విద్యా రంగంలో మోదీ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా ఐఐటీలు, ఐఐఎంలు, గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ సీట్లను కూడా గణనీయంగా పెంచామని వివరించారు. గత పాలనలతో పోలిస్తే తమ ప్రభుత్వంలోనే పరీక్షల పేపర్ లీకేజీలు బాగా తగ్గాయని, నీట్ వ్యవహారంలో సమస్య రాగానే కేంద్రం వెంటనే కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు.
నీట్ అంశాన్ని సాకుగా చూపి కొందరు ప్రతిపక్ష నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పీవీఎన్ మాధవ్ విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రధానితో పాటు సుప్రీంకోర్టుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, నటుడు ప్రకాశ్ రాజ్ సహా కొందరు విద్రోహకర వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ పాలనలో జరిగిన పేపర్ లీకేజీలపై పార్లమెంట్‌లో మాట్లాడాలని ఆయన సవాల్ చేశారు.
విశాఖపట్నం సమీపంలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని మాధవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా 13 వేల మంది కళాకారులతో థింసా నృత్యం, బొబ్బిలి వీణ నాదంతో ప్రధానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక ఉత్తరాంధ్ర సమగ్రంగా అభివృద్ధి చెందుతుందనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని, ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారని వివరించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం: కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
- పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు కేంద్ర కేబినెట్ ఆమోదం: 10 ఏళ్ల జైలు, రూ. 10 కోట్ల జరిమానా
- హైదరాబాద్కి సమీపంలో తెలంగాణ లడఖ్గా పేరొందిన విశాఖ కాలనీ
- జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్
- జూలై 25న స్టాక్ మార్కెట్లకు శనివారం సెలవు
