Advertisement

ప్రభాస్ ఫౌజీ కొత్త పోస్టర్ విడుదల

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ఫౌజీ నుంచి మేకర్స్ ఒక విశేషమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆయన సైనిక రూపాన్ని సూచించేలా డిజైన్ చేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు.

క్యారెక్టర్ రివీల్ వీడియో

ఈ పోస్టర్‌లో మంటల నడుమ ఉన్న బంగారు నాణేంపై ప్రభాస్ రూపం కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ డ్రామాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Advertisement
Advertisement