Advertisement

PMVBRY Portal: కొత్త ఉద్యోగులకు రూ.15,000 ప్రోత్సాహకం

మన పత్రిక, వెబ్​డెస్క్

కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ( PMVBRY ) అధికారిక పోర్టల్‌ను ప్రారంభించారు. పోర్టల్ pmviksitbharatrozgaryojana.com ఆగస్టు 18 నుంచి అందుబాటులో ఉంది.

Advertisement

ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు ఎన్‌రోల్ అయిన కొత్త ఉద్యోగులు, యజమానులు ప్రయోజనాల కోసం పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఉమాంగ్ యాప్ ద్వారా UAN అప్లోడ్ చేయాలి. ఈ పథకం ప్రకారం మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి రూ. 15,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది ఒక నెల సగటు వేతనం (బేసిక్ + DA) గా రెండు విడతల్లో చెల్లిస్తారు.

పథకం రెండు భాగాలు: పార్ట్-ఏ (ఉద్యోగులు), పార్ట్-బీ (యజమానులు). యజమానులు కొత్త ఉద్యోగులను నియమిస్తే జీతం ఆధారంగా రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈపీఎఫ్ ( EPFO ) మినహాయింపు సంస్థలకు కూడా పథకం వర్తిస్తుంది. కానీ ECR దాఖలు చేయాలి. ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ ఓపెన్ చేయాలి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జులై 31 వరకు 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా రూ. లక్ష కోట్లు కేటాయించారు.

Advertisement