మన పత్రిక, వెబ్‌డెస్క్: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించనుంది. త్వరలోనే 22వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.
ఎప్పుడు జమ అవుతాయంటే? ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఏటా రూ.6,000 మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 21 విడతల డబ్బులు అందగా.. రానున్న ఫిబ్రవరి నెలలో 22వ విడత నిధులను (రూ.2,000) విడుదల చేయనున్నారు.
Advertisement
తప్పనిసరిగా చేయాల్సిన పని: ఈ డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులు ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాల్సి ఉంది.
- రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఈ-కేవైసీ (e-KYC) పూర్తయిందో లేదో వెంటనే సరిచూసుకోవాలి.
- ఒకవేళ పూర్తి కాకపోతే, వెంటనే ఆధార్ కార్డు తీసుకుని బ్యాంకుకు వెళ్లి ఈ-కేవైసీ అప్డేట్ చేసుకోవాలి.
- ఇది పూర్తయిన వారికి మాత్రమే 22వ విడత డబ్బులు జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
