Advertisement

PM Kisan: రైతులకు రూ.2000.. జమ అయ్యేది అప్పుడే! ఈ-కేవైసీ తప్పనిసరి

మన పత్రిక, వెబ్​డెస్క్: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించనుంది. త్వరలోనే 22వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.

ఎప్పుడు జమ అవుతాయంటే? ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఏటా రూ.6,000 మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 21 విడతల డబ్బులు అందగా.. రానున్న ఫిబ్రవరి నెలలో 22వ విడత నిధులను (రూ.2,000) విడుదల చేయనున్నారు.

Advertisement

తప్పనిసరిగా చేయాల్సిన పని: ఈ డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులు ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాల్సి ఉంది.

  • రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఈ-కేవైసీ (e-KYC) పూర్తయిందో లేదో వెంటనే సరిచూసుకోవాలి.
  • ఒకవేళ పూర్తి కాకపోతే, వెంటనే ఆధార్ కార్డు తీసుకుని బ్యాంకుకు వెళ్లి ఈ-కేవైసీ అప్డేట్ చేసుకోవాలి.
  • ఇది పూర్తయిన వారికి మాత్రమే 22వ విడత డబ్బులు జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Advertisement