గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న “పెద్ది” (Peddi) సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ గురించి నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ కూడా వచ్చింది. మొన్నటివరకు ఢిల్లీ లో జరిగిన షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి సంక్రాంతి పండగ సందర్బంగా కాస్త విరామం ప్రకటించారు. అయితే పండగ తర్వాత షెడ్యూల్ గురించి ఓ సమాచారం వైరల్ అవుతుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పెద్ది నెక్స్ట్ షెడ్యూల్ యూరప్ లో జరగనుందని సమాచారం.
యూరోప్ లో పెద్ది కి సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ జరుగనుందని టాక్. అంతే కాదు పెద్ది క్లైమాక్స్ గురించి ఓ క్రేజీ రూమర్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అదేంటంటే పెద్దిలో క్లైమాక్స్ లో హీరోకు ఓ ప్రమాదంలో రెండు కాళ్ళు పోతాయట. అయినప్పటికీ రన్నింగ్ రేస్ లో హీరో ఛాంపియన్ అవుతాడని, ఆ సీన్స్ చాలా భావోద్వేగంగా ఉంటాయని, సినిమాకి చాలా ప్లస్ అవుతాయని సమాచారం. అలాగే ఆడియన్స్ ఊహించినదానికంటే పెద్ది చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని బుచ్చిబాబు (Buchibabu) కూడా పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు.
ఇక పెద్ది నుండి ఇప్పటికే వచ్చిన టీజర్, చికిరి (Chikiri song) సాంగ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోగా, పెద్ది సెకండ్ సింగిల్ ని సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెద్దిలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రల్లో నటిస్తుండగా, జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 27న పెద్ది పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది .
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
