Advertisement
pedda amberpet bus accident

Bus Accident: పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌పై బస్సు బోల్తా.. 6 మందికి గాయాలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ఈ బస్సు, జంక్షన్ వద్ద అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కకు పడిపోయింది.

Advertisement

ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే డీఆర్డీవో అపోలో, హయత్‌నగర్ ఆస్పత్రులకు తరలించారు. మలుపు వద్ద డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement