పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు. 10 సంవత్సరాల పాటు ఒక్క సక్సెస్ లేకపోయినా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి అవకాశం దొరికిన ప్రతీసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
రీసెంట్ గా ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో మరోసారి తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్నాడు. పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ సినిమా చేయలేడు అని చెప్పిన ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు.
ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథలను విన్న పవన్ కళ్యాణ్ తక్కువ రోజుల్లో సినిమాలను చేసే దర్శకులకు తన డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక అందులో అనిల్ రావిపూడి పేరు ప్రథమంగా వినిపిస్తుంది. నిజానికి అనిల్ రావిపూడి రొటీన్ రొట్ట కథలను సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ అతని సినిమాలకు ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్ లేదు.
వరుస సక్సెస్ లను సాధించే దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు తప్ప కంటెంట్ ను నమ్ముకొని సూపర్ సక్సెస్ ని సాధించే డైరెక్టర్ గా అతను ఇప్పటికి ఐడెంటిటిని క్రియేట్ చేసుకోలేకపోయాడు… ఇక ఇతనితోపాటుగా తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు పేరు కూడా ప్రథమంగా వినిపిస్తుంది. వీళ్లిద్దరిలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే దర్శకుడు ఎవరు అనేది ఫైనల్ చేయాలని చూస్తున్నాడు. ఇక దీనికోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగాడు. అనిల్ సినిమాలు కొంచెం రొటీన్ గా ఉంటాయి.
అందువల్ల అతన్ని పక్కన పెట్టి లోకేష్ కనకరాజు కి అవకాశం ఇవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అలాగే తను తక్కువ రోజుల్లో సినిమాను చేయగలుగుతాడు. దాంతోపాటు సినిమా చాలా స్టైలిష్ గా ఉంటుంది. కాబట్టి ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చెబుతున్నారట. మరి ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

