Advertisement

కొండగట్టుకు పవన్ కల్యాణ్.. రూ.35 కోట్లతో టీటీడీ పనులకు శంకుస్థాపన

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించనున్నారు. 2026 జనవరి 3 (శనివారం) ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం పనులకు భూమిపూజ నిర్వహిస్తారు.

ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా ఈ మండపం నిర్మాణం జరగనుంది. హనుమాన్ మాలధారుల సౌకర్యార్థం టీటీడీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement