మన పత్రిక, వెబ్‌డెస్క్: పటాన్‌చెరు పట్టణం జాతీయ స్థాయి క్రీడా సంబరానికి వేదిక కానుంది. జనవరి 4న స్థానిక మైత్రి మైదానంలో ‘జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్’ పోటీలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
యువత శారీరక దారుఢ్యం, మానసిక క్రమశిక్షణతో ఎదగాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు. పటాన్‌చెరు గడ్డపై తొలిసారిగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బాడీ బిల్డర్లు పాల్గొననున్నారు. యువత వ్యాయామం, క్రీడలను జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
