మన పత్రిక, వెబ్‌డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) చుట్టూ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, హరీష్ రావు చేసిన ‘జల ద్రోహం’పై ‘సిట్’ (SIT – Special Investigation Team) విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రేవంత్ ఆరోపణలు – సిట్ విచారణకు కారణాలు:
- డిజైన్ మార్పు: కేబినెట్ ఆమోదం లేకుండానే ప్రాజెక్టు ఇన్‌టేక్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మార్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని రేవంత్ ఆరోపించారు.
- ఖర్చు పెంపు: ఈ మార్పు వల్ల 3 స్టేజీలు 5కు, 22 పంపులు 37కు పెరిగాయని, ఫలితంగా రూ.32 వేల కోట్ల అంచనా వ్యయం ఏకంగా రూ.84 వేల కోట్లకు పెరిగిందని ధ్వజమెత్తారు. ఇది కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమేనని మండిపడ్డారు.
- తీవ్ర వ్యాఖ్యలు: “కేసీఆర్, హరీష్ చేసిన ద్రోహానికి వారిని ఉరితీసినా తప్పులేదు. ఇవే తప్పులు మిడిల్ ఈస్ట్‌లో చేసి ఉంటే రాళ్లతో కొట్టి చంపేవారు,” అని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హరీష్ రావు కౌంటర్ – వాస్తవాలు: రేవంత్ విమర్శలపై హరీష్ రావు స్పందిస్తూ.. జూరాల వద్ద నీటి లభ్యత తక్కువని, తుంగభద్ర నుంచి వచ్చే వరదతో శ్రీశైలం వద్ద నీరు ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే డిజైన్ మార్చామని సమర్థించుకున్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 13-14 టీఎంసీల నీటిని తరలిస్తుంటే.. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
