మన పత్రిక, వెబ్‌డెస్క్: వన్‌ప్లస్ (OnePlus) ప్రియులకు అదిరిపోయే వార్త. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. చైనాలో ‘టర్బో 6’ సిరీస్ పేరుతో జనవరి 8న లాంచ్ అవుతున్న ఫోనే.. భారత్‌లో ‘వన్‌ప్లస్ నార్డ్ 6’ (OnePlus Nord 6) పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి మిడ్ రేంజ్‌లో కనీవినీ ఎరుగని ఫీచర్లతో వన్‌ప్లస్ రాబోతోంది.
నార్డ్ 6 హైలైట్ ఫీచర్లు (అంచనా):
Advertisement
- భారీ బ్యాటరీ: అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏంటంటే.. ఈ ఫోన్‌లో ఏకంగా 9,000mAh బ్యాటరీ ఉండబోతోంది. ఒకవేళ ఇదే నిజమైతే దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా ఇది రికార్డు సృష్టిస్తుంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
- పవర్ ఫుల్ ప్రాసెసర్: ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 (Snapdragon 8s Gen 4) చిప్‌సెట్ వాడనున్నారు. ఇది గేమింగ్‌కు, మల్టీ టాస్కింగ్‌కు సూపర్ స్పీడ్‌ను అందిస్తుంది.
- డిస్‌ప్లే: గేమర్ల కోసం ప్రత్యేకంగా 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను ఇందులో అమర్చారు.
- కెమెరా & డిజైన్: వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. వన్‌ప్లస్ 15 సిరీస్ డిజైన్‌ను పోలి ఉంటూ.. IP68/IP69 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది.
ధర ఎంత ఉండొచ్చు? నార్డ్ 6 ధర భారత్‌లో రూ. 35,000 లోపు ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 13ఆర్ (రూ. 40 వేలు) కంటే తక్కువ ధరలోనే ఇది అందుబాటులోకి రానుంది. అలాగే ‘నార్డ్ సీఈ 6’ పేరుతో మరో తక్కువ ధర వేరియంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
