మన పత్రిక, వెబ్డెస్క్
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ(Konaseema) జిల్లాలోని చిన్నగాడవిల్లి గ్రామంలో గణపతి నిమజ్జనం సందర్భంగా విషాదం నెలకొంది. డీజే సౌండ్‌కు(DJ Sound) డ్యాన్స్ చేస్తూ గుత్తుల ప్రసాద్ (37) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఊహించని ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిమజ్జనం సందర్భంగా ఈ ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
