OG Movie news : ఈ టికెట్ ఓజీ సినిమాకు సంబంధించినదా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరుతో అధిక రేట్లకు టికెట్లు అమ్మకం జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రీమియర్ షోలకు గరిష్ఠం 800 రూపాయలు వరకే అనుమతి ఉన్నా.., 2000-2500 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
థియేటర్లు ఆఫ్‌లైన్ టికెట్లను బ్లాక్ చేసి, అధిక రేట్లకు అమ్ముతున్నాయని ప్రేక్షకులు ఫిర్యాదు చేస్తున్నారు. జీఎస్టీ లెక్కల్లో 50 రూపాయలు మాత్రమే చూపిస్తే, నిజంగా 800 రూపాయలు వసూలు చేస్తే – ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమాటోగ్రఫీ శాఖ ఏమైంది? పర్యవేక్షణ ఉందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇది ఓజీ ( They Call Him OG ) మాత్రమే కాదు, ప్రతి పెద్ద సినిమా విడుదల సమయంలో ఇలాంటి దందాలు జరుగుతున్నాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

