బెనిఫిట్ షోలకు రూ.800 వరకు, సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 వరకు టికెట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. పుష్ప 2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ప్రకటించారు.
అయితే ఓజీ సినిమాకు మాత్రం బెనిఫిట్ షో ( og benefit show ) , టికెట్ ధర పెంపుకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదం అయ్యింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాపై ప్రత్యేక పరిగణన ఉందా? అనే ప్రశ్నలు నెట్టింట మొదలయ్యాయి. సాధారణంగా హీరోలతో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాలు చేయిస్తారు. కానీ ఓజీ నుంచి ఇప్పటి వరకు అలాంటి వీడియోలు రాలేదు.
ఇప్పటికే బెనిఫిట్ షో టికెట్లు దాదాపు ఫుల్ అయ్యాయి. రూ.800 నుంచి రూ.2–3 వేలకు కూడా అభిమానులు టికెట్లు కొంటున్నారు. హైకోర్టు స్టేతో తెలంగాణ ప్రేక్షకులకు కాస్త ఉపశమనం లభించింది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

