Advertisement

నువ్వు నాకు నచ్చావ్ 4K రీ-రిలీజ్.. వెంకీ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలుగు సినీ ప్రేమికులకు నూతన సంవత్సర కానుకగా విక్టరీ వెంకటేష్ క్లాసిక్ హిట్ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) మళ్లీ థియేటర్లలోకి రానుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత, ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి 4K సాంకేతిక హంగులతో 2026 జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ప్రకటించారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) మాటల మ్యాజిక్, విజయ భాస్కర్ దర్శకత్వం, వెంకటేష్-ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పటికీ టీవీల్లో వస్తే చానల్ మార్చకుండా చూసే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై మళ్లీ చూసి ఎంజాయ్ చేయమని మేకర్స్ కోరుతున్నారు.

Advertisement
Advertisement