Advertisement

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026లో ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెట్టి అప్పుడే వారం గడిచిపోయింది. ఈ ఏడాది తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే, న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం 2026లో కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం బలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. సూర్యుడితో ముడిపడి ఉన్న ఈ ఏడాదిలో శని, గురు గ్రహాల ప్రభావం కూడా ఉండటంతో ఈ కింది తేదీల్లో జన్మించిన వారికి అదృష్టం వరిస్తుందట.

1, 10 తేదీల్లో పుట్టిన వారు ఏదైనా నెలలో 1 లేదా 10వ తేదీన జన్మించిన వారికి ఈ ఏడాది కలిసి వస్తుంది. వీరికి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి. నిరంతరం కష్టపడితే కచ్చితంగా మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు.

Advertisement

4, 22 తేదీల్లో పుట్టిన వారు నెలలో 4, 22 తేదీల్లో పుట్టిన వారికి రాహువు అనుగ్రహం ఉంటుంది. వీరు ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చదువుపై ఆసక్తి, శ్రద్ధ పెరుగుతుంది. విభిన్నంగా ఆలోచించే తత్వం వల్ల ప్రభుత్వ ఉద్యోగాన్ని సులభంగా పొందే ఛాన్స్ ఉందని న్యూమరాలజీ చెబుతోంది.

13, 19, 28 తేదీల్లో పుట్టిన వారు

  • 13, 19 తేదీలు: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని, సూర్య గ్రహాల అనుకూల దృష్టి ఉంటుంది. కష్టపడి ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉద్యోగం తలుపు తడుతుంది.
  • 28వ తేదీ: ఈ తేదీన జన్మించిన వారికి గురు గ్రహ (Jupiter) అనుగ్రహం ఉంటుంది. దీంతో తక్కువ కష్టంతోనే త్వరగా విజయం లభిస్తుంది.

మొత్తంగా ఈ తేదీల్లో పుట్టిన వారు కొంచెం ప్రణాళికతో చదివితే 2026లో సర్కారీ కొలువు సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement