Advertisement

Mee Seva | మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్

మన పత్రిక, వెబ్​డెస్క్ : New Meeseva Centers in Rangareddy District. రంగారెడ్డి జిల్లాలో కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

Rangareddy Meeseva Centers Notification 2025

మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబడే మండలాలు:

Advertisement
  • గండిపేట మండలం: వట్టినాగులపల్లి, గండిపేట, కిస్మత్ పూర్, గంధంగూడ
  • మొయినాబాద్ మండలం: అజీజ్ నగర్, హిమాయత్ నగర్, కనకమామిడి
  • చౌదరిగూడ మండలం: తుంపల్లి, ఎదిర
  • సరూర్ నగర్ మండలం: తుమ్మబౌలి
  • మంచాల మండలం: లోయపల్లి

దరఖాస్తు వివరాలు:

  • దరఖాస్తు గడువు: ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 20, 2025 వరకు
  • దరఖాస్తు ఫీజు: రూ.500/- (తిరిగి ఇవ్వనిది). డిడి జిల్లా కలెక్టర్ పేరు మీద తీసి, ఫారానికి జత చేయాలి.

అర్హతలు:

  • అభ్యర్థి స్థానికుడు (ఆ మండలానికి చెందినవాడు) కావాలి.
  • కనీస విద్యార్హత: డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ.
  • కంప్యూటర్ పై సర్టిఫికెట్ తో పాటు సమగ్ర పరిజ్ఞానం ఉండాలి.
  • వయస్సు: 21 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
  • మీసేవ కేంద్రాన్ని నిర్వహించేందుకు సరైన పెట్టుబడి సదుపాయం ఉండాలి.
  • నేర చరిత్ర లేని వారు మాత్రమే అర్హులు.

ఎంపిక ప్రక్రియ:

  • అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
  • పేదవారు, వికలాంగులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల యువతకు ప్రాధాన్యత ఇస్తారు.

మరింత సమాచారం కోసం: https://rangareddy.telangana.gov.in/notification-issued-for-new-meeseva-centers-in-rangareddy-district/

Advertisement