మన పత్రిక, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) ఆదివారం సాయంత్రం భారీ వర్షం (Heavy Rains) దంచికొట్టింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Advertisement
మరోవైపు, ఈ అకాల వర్షం అన్నదాతలను ఆయోమయంలో పడేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ ధాన్యంలోకి నీళ్లు చేరాయి. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ, పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

