మన పత్రిక, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా ( Nizamabad District ) ఆలూర్ మండల ( Alur Mandal ) కేంద్రానికి చెందిన కుర్మే బీజ చిన్న రాజేష్ (45) గల్ఫ్ దేశం ఇరాక్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా, జీవనోపాధి కోసం ఒకటిన్నర సంవత్సరం క్రితం రాజేష్ విదేశాలకు వెళ్లాడు.
అక్కడ ఓ నిర్మాణ పనులు చేస్తుండగా, నిన్న (శుక్రవారం) ప్రమాదవశాత్తు బ్రిడ్జి పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు శనివారం సమాచారం అందింది. మృతుడు రాజేష్‌కు తల్లి, భార్య సునీత, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
రాజేష్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

