Advertisement

Nirmal: పొగమంచు వాహనదారులకు ఇబ్బందులు

Nirmal News: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి, తర్లపాడు, ఎల్లాపూర్ సహా పలు గ్రామాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు పొగమంచు కమ్మేసింది. దృశ్యం అస్పష్టంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో డ్రైవర్లు నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లారు. పొగమంచు కొంతసేపటికి తగ్గినా, ఉదయం రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు హెడ్లైట్లు, ఫోగ్ లైట్లు వాడాలని అధికారులు సూచించారు.

Advertisement
Advertisement