Advertisement

జగన్‌ది రాక్షస మనస్తత్వం అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ

మన పత్రిక: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం అని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ రైతు ద్రోహి అని పేర్కొన్న మంత్రి, ఆయన పాలనలో రైతులు పడిన ఇబ్బందులను గుర్తు చేశారు.

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నీటి ఎద్దడి నెలకొందని ఆయన వివరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పట్టిసీమ ప్రాజెక్టు రైతులకు ప్రాణం పోస్తోందని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement