Advertisement

కడపలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

మన పత్రిక, కడప: కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ సంస్థ చేపట్టిన ప్లాంట్ విస్తరణ పనులకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం సదరు సంస్థ రూ.3,100 కోట్ల మేర పెట్టుబడిని కేటాయించింది.

ఈ విస్తరణ పనుల ద్వారా ప్లాంట్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 3.6 మిలియన్ టన్నుల నుంచి 9.6 మిలియన్ టన్నులకు పెరగనుంది. దీనివల్ల స్థానికంగా కొత్తగా 1,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, సవితలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ విస్తరణ దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement