Advertisement

అమెరికాలో హత్యకు గురైన నిఖితా మృతదేహం హైదరాబాద్ కు.. నిందితుడు అరెస్ట్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: అమెరికాలోని మేరీల్యాండ్‌లో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ యువతి నిఖితా గోదిశాల (27) మృతదేహం నేడు (జనవరి 8) నగరానికి చేరుకోనుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో విదేశాంగ శాఖ అన్ని అనుమతులు జారీ చేసిందని, బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు ప్రక్రియను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు.

నిఖితా తన మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మ చేతిలో న్యూ ఇయర్ ఈవ్ రోజున దారుణంగా హత్యకు గురైంది. నిందితుడు హత్య అనంతరం భారత్ కు పారిపోగా, అంతర్జాతీయ లుకౌట్ నోటీసుల ఆధారంగా పోలీసులు అతడిని తమిళనాడులో అరెస్ట్ చేశారు. నిఖితా శరీరంపై పలు కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement
Advertisement